ఏపీ
ఏపీ లిక్కర్ స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. మాజీ మంత్రిని అరెస్ట్ చేసిన ఈడీ!..
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు ఆదివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఉన్న ఆయన నివాసంలోనే అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. బషీర్ బాగ్ లో ఉన్న ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. కాసేపట్లో ఆయన్ను ఈడీ అధికారులు విచారించనున్నట్లు సమాచారం.
