ఏపీ
AP LocalBody Elections: కంచుకోటలు బద్దలు.. నిజంగానే రిగ్గింగ్ జరిగిందా?
AP LocalBody Elections: ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మొన్నటి మున్సిపల్ ఎన్నికల ఊపును కొనసాగిస్తూ కూటమి భారీగా స్థానాలను చేజిక్కించుకోగా, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా అయిన పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని సైతం టీడీపీ కైవసం చేసుకోవడం రాష్ట్రాన్నే కుదిపేసింది. అయితే, దశాబ్దాలుగా తిరుగులేని కంచుకోటగా ఉన్న పులివెందులలోనే ఫ్యాన్ పార్టీ కుప్పకూలిపోవడం వెనుక ఉన్నది నిజమైన ప్రజా తీర్పేనా లేక అధికార బలంతో నడిచిన భారీ రిగ్గింగ్ మాయాజాలమా అనే సరికొత్త అనుమానాలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
