ఏపీ
ap local body elections : ఏపీలో మున్సిపల్ ఎన్నికలు రీషెడ్యూల్.. కొత్త పోలింగ్ తేదీ ఇదే!
p local body elections : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక మార్పులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జరగాల్సిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీని రీషెడ్యూల్ చేస్తూ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. పాత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న జరగాల్సిన మున్సిపల్ పోలింగ్‌ను నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. ఇక ఈ ఎన్నికల ఫలితాలను నవంబర్ 3న వెల్లడించనున్నట్లు స్పష్టం చేసింది. బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా ఈ నెల 25న విడుదల కానుంది.రాష్ట్రంలోని మిగతా మున్సిపాలిటీలన్నింటికీ నవంబర్ 1న పోలింగ్ ఖరారైనప్పటికీ, వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరుపై మాత్రం ఈసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
