స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు..
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రూట్ క్లియర్ అయ్యింది. రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల మేరకు పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు ఇటీవల బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 105కు సవరణలు చేసి కొత్తగా జీవో నెంబర్ 153ను జారీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.దీంతో త్వరలోనే ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఇదిలాఉండగా, ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి సర్కార్ సిద్ధపడగా..ఇది రాజ్యంగం స్ఫూర్తికి విరద్ధమంటూ కొందరు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై గతంలో విచారణ జరిపిన హైకోర్టు.. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని తీర్పుచెప్పింది. దాంతో ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తీర్పును సమర్ధించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని ప్రకటించింది.
