ఏపీ
ఎట్టకేలకు ఐఏఎస్ ఆమ్రపాలిని కరుణించిన ఏపీ సర్కార్..
తెలంగాణలో పనిచేసి వెళ్లిన ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిని ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు కరుణించింది. మొన్నటివరకు ఎలాంటి పోస్టింగ్ లేకుండా ఆమె ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణలో పనిచేయాలని ఆమె గత కొంతకాలంగా ఫైట్ చేస్తున్నారు. కానీ ‘క్యాట్’(CAT) ఆమె రిక్టెస్ట్ను పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత క్యాడర్ కేటాయింపు వివాదాల నేపథ్యంలో ఆమెను ఏపీకి కేటాయించారు. కానీ, ఆమె అక్కడ విధుల్లో చేరడానికి అయిష్టత చూపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ బదిలీల్లో భాగంగా ఆమెకు తిరిగి పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా కీలక బాధ్యతలను అప్పగించింది. మొత్తం 11 మంది ఐఏఎస్లకు పోస్టింగ్స్ ఇస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ సోమవారం ఉత్వర్వులు జారీ చేసింది.
