ఏపీ

తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. ఎస్వీ మ్యూజియం ప్రారంభానికి ముహూర్తం ఖరారు!..

తిరుమలలో భక్తులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎస్వీ మ్యూజియం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించేందుకు టీటీడీ ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సిద్ధమవుతున్న మ్యూజియం పనులను అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. మరోవైపు ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గరుడసేవ సందర్భంగా భారీగా భక్తులు తరలిరానుండటంతో మొబైల్ నెట్‌వర్క్, సిగ్నల్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని టీటీడీ ఆదేశించింది.