ఏపీ

AP Cyclones: డబుల్ సైక్లోన్ దెబ్బకు ఏపీ విలవిల.. 'అర్ణబ్' అతలాకులం.. ముంచేసిన 'మురుసు'

AP Cyclones: తీర ప్రాంత ప్రజలు ఒక గండం గడిచిందని ఊపిరి పీల్చుకునే లోపే మరో పెను ముప్పు వచ్చి పడింది. మొన్నటికి మొన్న 'అర్నబ్' తుఫాను సృష్టించిన బీభత్సం నుంచి కోలుకోకముందే.. ఇప్పుడు 'మురుసు' రూపంలో ఇంకో తుఫాను విరుచుకుపడింది. ఇలా ఒకదాని వెంట ఒకటి రోజుల వ్యవధిలోనే రెండు తుఫాన్లు దాడి చేయడంతో కోస్తాంధ్ర అల్లాడిపోతోంది. అటు అన్నదాతల కష్టాలు, ఇటు ప్రభుత్వ ఖజానా పరిస్థితి.. రెండూ అగమ్యగోచరంగా మారాయి.అర్నబ్ తుఫాను కారణంగానే దాదాపు 4,563 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ప్రాథమికంగా లెక్క తేల్చారు. ఆ దెబ్బ నుంచి ఇంకా తేరుకోకముందే మురుసు తుఫాను ఒంగోలు దగ్గర తీరం దాటింది. 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, దంచికొట్టిన వానలతో జనం వణికిపోయారు. గుంటూరు, బాపట్ల, పొన్నూరు ప్రాంతాల్లో కుండపోత వానలు పడ్డాయి.