ఏపీ

నేడు ఏపీకి సీఎం విజయ్.. నదుల అనుసంధానానికి లైన్ క్లియర్?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు రానున్నారు. ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా 'విజయవాడ ఉత్సవ్ 2.0' కార్యక్రమంలో పాల్గొనడానికి కూటమి ఎంపీలు ఆహ్వానం పలకడంతో ఆయన హాజరవుతున్నట్టు తెలుస్తోంది. అయితే, విజయ్ రాక సందర్బంగా ఏపీ ప్రభుత్వంతో పలు కీలక చర్చలు జరపనున్నట్టు సమాచారం.దసరా వేడుకల్లో భాగంగా ముందుగా సీఎం విజయ్ ఇవాళ సాయంత్రం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనం చేసుకోనున్నారు.అనంతరం ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. గోదావరి-కావేరి నదుల అనుసంధానం, కృష్ణా నది నీటి విడుదలపై చర్చ జరపనున్నట్టు తెలుస్తోంది.