ఏపీ
AP : సీఎం సభాస్థలి దగ్గర పేలిన సిలిండర్
AP : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న బహిరంగ సభ సమీపంలో గ్యాస్ సిలిండర్ పేలడం తీవ్ర కలకలం రేపింది. బుధవారం సాయంత్రం విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ముఖ్యమంత్రి సభ జరుగుతున్న ప్రాంతానికి సమీపంలోనే ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో సభకు హాజరైన ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది, పోలీసులు తక్షణమే అప్రమత్తమై నిమిషాల వ్యవధిలోనే పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
