ఏపీ

తిరుమలలో ఏసీబీ కలకలం.. టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో సోదాలు!..

టీటీడీ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తిరుపతి పెద్దకాపు లేఅవుట్‌లోని ఆయన నివాసంలో నేటి ఉదయం 6 గంటల నుంచి తనిఖీలు కొనసాగుతున్నట్టు సమాచారం.. కాగా ఈ సోదాలు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మొత్తం ఏడు బృందాలు ఏకకాలంలో చేపట్టాయి.

లోకనాథం ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తిరుమలలో లోకనాథంకు సంబంధించిన గెస్ట్‌హౌస్‌తో పాటు.. తిరుపతిలోని ఆయన ఇద్దరు బావమరుదుల ఇళ్లతో పాటు.. ఏర్పేడు మండలం చెల్లూరులోని ఆయన సోదరుడి నివాసంలో సైతం సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది.