క్రైమ్

AP: రూ.25కోట్ల ఆస్తి కోసమే .. విచారణలో నోరు విప్పిన సాధిక్‌ఖాన్!

ఏపీలో సంచలనం సృష్టించిన పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షేక్ సాధిక్‌ఖాన్ పోలీసుల విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు. సర్పవరం పోలీసులు జరిపిన మూడు రోజుల కస్టడీ విచారణలో భాగంగా పక్కా సాంకేతిక ఆధారాలను ముందంచడంతో, నూకరాజు అల్లుడైన జగదీశ్వరరెడ్డిని తానే పథకం ప్రకారం విషం ఇచ్చి హత్య చేసినట్లు నిందితుడు స్పష్టం చేశాడు.