ఏపీ
AP : సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సహా మరో 16 మందిపై కేసు..!
బిగ్బాస్ విజేత,టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మీద కేసు నమోదు అయ్యింది. ఆయనతో పాటు మరో 16 మందిపై ఆంధప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ఎఫ్ఐఆర్ నమోదు అయినట్టు సమాచారం. ప్రస్తుతం రాహుల్ పలు సినిమాల్లో పాటలు పాడుతూ.. యూట్యూబ్ సాంగ్స్ చేస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గతంలోనూ ఓ పబ్బులో ఆయన మీద దాడి జరిగిన విషయం సంచలనం రేపింది. తాజాగా కేసు నమోదు కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, రాహుల్ సిప్లిగంజ్ బావమరిది రాహుల్ రెడ్డి తనను చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
