సినిమా
Anurag Kashyap: మొన్న 'డెకాయిట్'..ఇప్పుడు 'కాకా'..బాలీవుడ్ డైరెక్టర్‌కి టాలీవుడ్లో ఛాన్స్
Anurag Kashyap: బాలీవుడ్ సహా ఇతర సౌత్ భాషల్లోని సీనియర్ స్టార్స్ మన తెలుగు సినిమాలలో మంచి పాత్రల్లో నటించి ఇక్కడ ప్రేక్షకుల్లో ఆదరణను దక్కించుకుంటున్నారు..ఈ విషయం, అందరికీ తెలిసిందే. కానీ, దర్శకులు అంతగా మన తెలుగు చిత్రాలలో నటిస్తున్నది చాలా అంటే చాలా తక్కువ. అయితే, ఈ మధ్య అడవి శేష్ నటించిన 'డెకాయిట్' సినిమాతో తెలుగులో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్
