International
ఫ్లైదుబాయ్ విమాన దాడి ఘటనలో మరో ట్విస్ట్.. ఇద్దరు పైలట్లు అరెస్ట్!
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయల్దేరిన ఫ్లైదుబాయ్ విమానం (FZ1073) కాక్‌పిట్‌లో గత నెలలో జరిగిన సంచలన దాడి కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. విమానాన్ని కూల్చివేసేందుకు పెద్దఎత్తున కుట్ర జరిగిందనే అనుమానాలు బలపడుతున్న తరుణంలో, దుబాయ్ పోలీసులు తాజాగా మరో ఇద్దరు మాల్దీవుల పైలట్లను అరెస్ట్ చేశారు. మాల్దీవుల వార్తా సంస్థ 'అధాదు' వెల్లడించిన వివరాల ప్రకారం.. గత శనివారమే ఈ అరెస్టులు జరగగా, యూఏఈలోని మాల్దీవుల రాయబార కార్యాలయం వారి కుటుంబ సభ్యులకు ఈ సమాచారాన్ని చేరవేసింది.
