తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ భూములను నిషేధిత జాబితాలో చేర్చేందుకు జీవో 134ను ముఖ్యమంత్రి ఉపయోగించారని, దానిని నిలిపివేయాలని స్టీఫెన్ సన్ వేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ‘ఓటుకు నోటు’ కేసులో రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశాననే పగతో సికింద్రాబాద్ బోయిగూడలో తనకున్న 1936 చదరపు గజాల స్థలాన్ని జీవో 134ను అడ్డం పెట్టుకుని నిషేధిత జాబితాలో చేర్చేందుకు కుట్ర చేస్తున్నారని హైకోర్టులో స్టీఫెన్ సన్ వాదనలు వినిపించారు.ఈ కేసును విచారణ అనంతరం జీవో 134ను నిలిపివేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తీర్పు కేవలం స్టీఫెన్సన్ భూములకు మాత్రమే వర్తిస్తుందని హైకోర్టు న్యాయమూర్తి స్పష్టంచేశారు.
