National

సీఎం విజయ్ మరో సంచలనం.. డీమిలిటేషన్‌కు వ్యతిరేకంగా తీర్మాణం

తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ మరోసారి సంలచన నిర్ణయం తీసుకున్నారు. డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మాణం ప్రవేశపెట్టారు. ఇప్పటికే నీట్, ఎఫ్‌సీఆర్ఏ బిల్లులకు సైతం వ్యతిరేకంగా టీవీకే సర్కార్ అసెంబ్లీలో తీర్మాణం పెట్టడమే కాకుండా ఆమోదించిన విషయం తెలిసిందే. తాజాగా డీలిమిటేషన్ మీద విజయ్ సర్కార్ నిర్ణయం సర్వత్రా చర్చకు దారి తీసింది. అయితే, డీలిటేషన్ వ్యతిరేకించడానికి గల కారణాలను ఆయన వెల్లడించారు. జనాభా నియంత్రణకు తమిళనాడులోని గత ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం వలన అక్కడ బర్త్ రేటు పడిపోయిందని.. ఇప్పుడు కేంద్రం జనాభా ప్రాతిపదినక నియోజకవర్గాల పునర్విభజన చేయడం వలన రాష్ట్రానికి ఎంపీ సీట్లు తగ్గిపోతాయని.. ఫలితంగా కేంద్రంలో రాష్ట్ర ప్రభావం తగ్గుతుందన్నారు. అది రాష్ట్ర ప్రజలకు నష్టం చేకూరుస్తుందని పేర్కొన్నారు.