తెలంగాణ
తెలంగాణలో మరో స్కామ్? నీళ్లే లేని చెరువుల్లో చేప పిల్లల పంపిణీ!
రాష్ట్రంలో నీళ్లు లేక చెరువులు ఎండిపోతుంటే అందులో చేప పిల్లలు వదిలేందుకు సర్కార్ సిద్ధం అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర మత్స్యశాఖ కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. ఎండిన చెరువుల్లో చేప పిల్లల పంపిణీ కోసం రూ.133 కోట్ల ప్రజాధనం వెచ్చించనున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా నిబంధనల ప్రకారం నీటి నిల్వలు 50 శాతం ఉండి, 6 నెలల పాటు నీటి నిల్వ ఉంటేనే చేప పిల్లలు విడుదల చేయాలని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈసారి 17,677 చెరువుల్లో దాదాపు 13 వేల చెరువులు ఎండిపోయినా చేప పిల్లల పంపిణీకి మత్స్యశాఖ సిద్ధం అవుతుండటంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చేప పిల్లల పంపిణీ పేరిట మరో కుంభకోణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ప్రచారం జరుగుతోంది.
