తెలంగాణ
వరంగల్ ఎంజీఎంలో మరో ప్రమాదం..
MGM Hospital: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వరుస ప్రమాదాలు పేషంట్లను, అక్కడ పని చేసే సిబ్బందిని తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఆరోగ్యశ్రీ వార్డులో సీలింగ్ స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డ ఘటన మరువక ముందే మరో ప్రమాదం చోటు చేసుకంది. RICU, ఫిజియోథెరపీ వార్డులో పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
అయితే, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. కాగా, పెచ్చులు ఊడిపడి ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పేషంట్లు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మీడియాను ఆసుపత్రిలోకి అనుమతించడం లేదు. మెయిన్ గేటు దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
