క్రైమ్
ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. కదిలే బస్సులో మైనర్పై గ్యాంగ్ రేప్
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది.నిత్యం పోలీసుల పహారా, చెక్ పోస్టులు ఉండే ప్రాంతంలో ఓ మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగింది. ఈ ఘటన ఆగస్టు 4 తేదీన చోటుచేసుకోగా..ఆలస్యంగా వెలుగుచూసింది. కాగా, ఈ దారుణ ఘటనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.దేశరాజధానిలో అమ్మాయిలకు భద్రత కరువైందని, మైనర్లకు రక్షణ కల్పించడంలో మోడీ సర్కార్ ఫెయిల్ అయ్యిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వివరాల్లోకివెళితే.. ఉత్తరప్రదేశ్ మైన్పురి జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని(16) తన కుటుంబ సభ్యులతో గొడవ పడి రాత్రి సమయంలో నోయిడాలోని బంధువుల ఇంటికి బయల్దేరింది. గ్రేటర్ నోయిడాలోని పరిచౌక్ వద్ద ఢిల్లీ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ స్లీపర్ బస్సు ఎక్కగా.. అందులో ఆ బాలిక తప్ప మరెవ్వరూ లేకపోవడంతో డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్ ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు.
