క్రీడలు

భారత చెస్ చరిత్రలో మరో మైలురాయి.. 100వ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన 22 ఏళ్ల కుర్రాడు!

 భారత చదరంగం చరిత్రలో మరో మైలురాయి నమోదైంది. మధ్యప్రదేశ్‌కు చెందిన 22ఏళ్ల కుర్రాడు అనుజ్ శ్రీవత్రి భారత 100వ చెస్ గ్రాండ్‌మాస్టర్(GM)గా అవతరించి రికార్డు సృష్టించాడు. ఫిలిప్పీన్స్‌లో వైభవంగా ముగిసిన '7వ ఏషియన్ ప్లస్ ఇండివిడ్యువల్ ఓపెన్ చెస్ ఛాంపియన్‌షిప్'లో విజేతగా నిలవడం ద్వారా ఆయన ఈ చారిత్రక ఘనతను చేజిక్కించుకున్నాడు. ఈ అద్భుత విజయంతో మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన తొలి క్రీడాకారుడిగా కూడా అనుజ్ రికార్డులో నిలిచాడు.