International

ఇండోనేషియాలో మరోసారి భారీ భూకంపం..

ద్వీపదేశమైన ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ స్థాయిలో భూమి కంపించింది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 05:07 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు భారత భూకంప అధ్యయన కేంద్రం అధికారికంగా వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.2గా నమోదైనట్టు ప్రకటించింది. భూ ఉపరితలం నుంచి సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. తెల్లవారు జామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా భూమి కంపించడంతో ఆ దేశ వాసులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి రోడ్లపైకి చేరుకున్నారు.