తెలంగాణ

సీఎం రేవంత్ మరో సోదరుడి భూ కుంభకోణం.. చిట్టా విప్పిన మన్నె క్రిశాంక్!

రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం భారీగా అవినీతికి పాల్పడుతోందని, రూ.వేల కోట్ల ఆస్తులు అక్రమంగా కాజేసి వారి, వారి బినామీల పేర్ల మీద పొగేశారని బీఆర్ఎస్ కీలక నేత మన్నె క్రిశాంక్ గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. రేవంత్ కుటుంబం, అతని సోదరులు పాల్పడిన అవినీతికి సంబంధించిన లెక్కలు తన వద్ద ఉన్నాయని ఆరోపించారు. ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ రెడ్డి మరో తమ్ముడు అనుముల కృష్ణారెడ్డి చేస్తున్న సెటిల్మెంట్స్ దందాను పూర్తి ఆధారాలతో మన్నె క్రిశాంక్ బయటపెట్టారు. తెలంగాణ భవన్‌లో సోమవారం మన్నెక్రిశాంక్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేకు ఫండ్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాలని అనుముల కృష్ణారెడ్డి బెదిరించినట్టు మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి గతంలో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చందన్‌వల్లి గ్రామంలోని 363 సర్వే నంబర్‌లో ఉన్న నిషేధిత భూమిలో 363/3 భూమిని ఇటీవలే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఆరోపించారు.