తెలంగాణ
హైదరాబాద్‌కు మరో మకుటం.. ఫ్యూచర్ సిటీలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం!
హైదరాబాద్‌ను అంతర్జాతీయ క్రీడా పటంలో అగ్రస్థానంలో నిలిపేలా తెలంగాణ ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో రూపొందుతున్న ఈ ప్రపంచస్థాయి క్రీడా ప్రాంగణం కోసం అధికారులు ఇప్పటికే స్థల సేకరణ ప్రక్రియను వేగవంతం చేశారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది డిసెంబర్లోనే ఈ భారీ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
