తెలంగాణ

రేవంత్ సర్కార్‌కు మరో బిగ్‌షాక్.. సమ్మక్కసాగర్ డీపీఆర్ రిటర్న్

తెలంగాణ ప్రభుత్వానికి మరో బిగ్ షాక్ తగిలింది. ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద నిర్మిస్తున్న సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ (తుపాకులగూడెం బ్యారేజీ) సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)ను కేంద్ర జలసంఘం (CWC) వెనక్కి పంపింది. ప్రాజెక్టుకు సంబంధించిన కమాండ్ ఏరియా (ఆయకట్టు) వివరాలు, 2011 నాటి ప్రమాణాలకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారం నివేదికలో స్పష్టంగా లేదని పేర్కొంది.ఇదిలాఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత వల్ల మరో ఇరిగేషన్ ప్రాజెక్టు డీపీఆర్ వెనక్కి వచ్చిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.ఏపీకి మేలు చేసేందుకే తెలంగాణకు అన్యాయం చేస్తున్నారంటూ మండిపడింది. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు కింద ఎంత భూమి సాగులోకి వస్తుందనే వివరాలు పొందుపరచకపోవడం, ఇతర వివరాలు కూడా సరిగ్గా చెప్పకపోవడంతో డీపీఆర్‌ను కేంద్ర జలవనరుల శాఖవెనక్కి పంపిందని వెల్లడించింది.