ఏపీ

AnnaLezhneva: పవన్ కోసం సర్వస్వం వదిలేస్తే.. అన్నా లెజినోవాకు దక్కిందేంటి?

AnnaLezhneva: పుట్టిన గడ్డను వదిలింది.. అలవాటైన జీవనశైలిని పక్కన పెట్టింది.. కట్టుబాట్లు, సంస్కృతి వేరైనా ఒక మనిషిపై ప్రేమతో అచ్చమైన తెలుగింటి కోడలిగా మారిపోయింది. పవన్ కల్యాణ్ కోసం తన దేశం, మతం సైతం మార్చుకుని సనాతన ధర్మాన్ని నిష్టగా పాటించిన ఒక విదేశీ మహిళకు 13 ఏళ్ల కాపురం తర్వాత చివరకు మిగిలింది కేవలం ఒక విడాకుల ప్రెస్ నోట్ మాత్రమేనా? సోమవారం అర్ధరాత్రి పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల పేర్లతో బయటకు వచ్చిన జాయింట్ స్టేట్‌మెంట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద చర్చకు తెరలేపింది.ఒక రష్యన్ మహిళగా భారత్‌కు వచ్చి, పవన్ కల్యాణ్ జీవిత భాగస్వామిగా మారిన తర్వాత అన్నా లెజినోవా ప్రవర్తించిన తీరు కోట్లాది మంది అభిమానులను ఆశ్చర్యపరిచింది. పవన్ భావజాలానికి తగ్గట్టుగా ఆమె పూర్తిగా రూపాంతరం చెందారు. రెండుసార్లు కాలిబాటన తిరుమల కొండకు నడిచివెళ్లి, శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుని తన భక్తిని చాటుకున్నారు.