తెలంగాణ
అంజయ్య నగర్ విషాదం.. భవన యాజమాని అరెస్టు
హైదరాబాద్ మహా నగరంలోని గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం కూలిన విషయం తెలిసిందే.ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. బిల్డర్, భవన యజమాని పరార్ అయ్యారు. ఎలాంటి అనుమతులు లేకుండా దాదాపు 40 గజాలలోపు స్థలంలో ఏడంస్తుల నిర్మాణం చేపట్టడం వల్లు ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటన జరిగిన నాటి నుంచి యజమాని కోసం గాలిస్తున్నారు. అయితే, దేశం విడిచి పారిపోతుండగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఓనర్ సయ్యద్ సాజిద్‌ను రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండానే సాజిద్ G+6 భవనం నిర్మించినట్టు జీహెచ్ఎంసీ అధికారులు తేల్చారు.
