ఏపీ

డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఖరారు.. జగన్‌ ప్లాన్‌ ఇదేనా?..

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో మండలి డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికపై జగన్‌ దిశానిర్దేశం చేశారు. మాధవరావు అభ్యర్థిత్వానికి పార్టీ ఎమ్మెల్సీలంతా పూర్తి మద్దతు ఇవ్వాలని సూచించారు. ఎన్నిక ప్రక్రియ సాఫీగా జరిగేలా ఎమ్మెల్సీలు సమన్వయంతో పనిచేయాలని జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం శాసనమండలిలో డిప్యూటీ ఛైర్మన్‌ పదవి ఖాళీగా ఉంది. త్వరలోనే ఈ పదవిని భర్తీ చేసేందుకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ముందుగానే తమ అభ్యర్థిని ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.