జగన్ కు తలనొప్పిగా మారిన లోకల్ వార్!..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక సమరానికి తెరలేస్తోంది.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిపక్ష వైసీపీ నేతలకు తీవ్రమైన టెన్షన్ తెచ్చిపెడుతున్నట్టు పొలిటికల్ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ముఖ్యంగా రాష్ట్రంలో పదహారు కార్పొరేషన్లలో మేయర్ స్థానాలు, పలు మున్సిపాలిటీల్లో ఛైర్మన్ అభ్యర్థుల ఎంపిక వైసీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జులకు నిద్రలేకుండా చేస్తోందని చర్చించుకుంటున్నారు.. మేయర్, ఛైర్మన్ ఎన్నికలు నేరుగా ప్రజల ద్వారా జరిగే ప్రత్యక్ష పోరు కావడంతో, ప్రలోభాలకు లొంగకుండా చివరి నిమిషం వరకూ పోరాడే బలమైన అభ్యర్థుల కోసం ఇప్పటి నుండే ఆరా తీస్తున్నట్టు చెప్పుకొంటున్నారు.. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని స్థానిక ఎన్నికల్లో ఎదుర్కోవడం వైసీపీకి అంత తేలిక కాదు. రాబోయే మూడేళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది కాబట్టి.. అభివృద్ధి పనులు జరగాలంటే అధికార పార్టీ నేతలను గెలిపించుకోవడమే మేలని ప్రజలు భావించే అవకాశాలున్నాయి.
