ఏపీ
Andhra Pradesh: వైసీపీ పతనానికి అప్పుడే పునాది పడిందా?.. జగన్ చేసిన పొరపాట్లు ఇవేనా?..
కడప లోక్సభ స్థానం నుంచి 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి రాజకీయాల్లో కీలక అడుగు వేసిన జగన్కు, అదే ఏడాది సెప్టెంబర్ 2న తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం పెద్ద మలుపుగా మారింది. వైఎస్సార్ తర్వాత జగన్ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్లు తెరపైకి వచ్చినప్పటికీ, కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం రోశయ్య వైపు మొగ్గు చూపి ఆయనకు బాధ్యతలు అప్పగించింది. అదేసమయంలో తన తండ్రి మరణ వార్తతో చనిపోయిన అభిమానుల కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర కాంగ్రెస్ నాయకత్వంతో విభేదాలకు కారణమైంది. చివరకు 2010 నవంబర్లో కాంగ్రెస్కు, ఎంపీ పదవికి జగన్ రాజీనామా చేసి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని 2011 మార్చి 12న స్థాపించారు. అదే సంవత్సరం కడప లోక్సభ, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భారీ విజయాలు సాధించి తన రాజకీయ బలాన్ని చాటుకున్నారు.
