ఏపీ

AP: కోస్తాంధ్రకు పెను ముప్పు.. అతి తీవ్ర తుపానుగా తీరం దాటే ఛాన్స్!

AP: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు, ముఖ్యంగా కోస్తాంధ్రకు పెను తుపాను గండం పొంచి ఉంది. ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం వేగంగా బలపడుతూ ముందుకు కదులుతోంది. ప్రస్తుతం ఇది చెన్నైకి 840 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 1,010 కిలోమీటర్ల దూరంలో ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా పయనిస్తున్న ఈ వాయుగుండం, రానున్న రోజుల్లో మరింత తీవ్రరూపం దాల్చి కోస్తాంధ్రపై విరుచుకుపడే ప్రమాదం కనిపిస్తోందని చెబుతున్నారు.వాతావరణ కేంద్రం హెచ్చరికల ప్రకారం.. ఉత్తర-వాయవ్య దిశగా కదులుతున్న ఈ వాయుగుండం రేపు తెల్లవారుజామున దక్షిణ, మధ్య పశ్చిమ బంగాళాఖాతంలో తుపానుగా మారనుంది.