ఏపీ

AP: అర్నబ్ తుఫాన్ బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు

AP: అర్నబ్ తుఫాన్ వల్ల నష్టపోయిన వాళ్లెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, బాధితులందరినీ అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి పరిస్థితులను సమీక్షించిన సీఎం, అనంతరం మీడియాతో మాట్లాడారు. పంటలు, ఆస్తులు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలబడుతుందని, ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు.తుఫాన్ దెబ్బకు ఐదుగురు చనిపోవడంపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం అందజేస్తామని చెప్పారు. ఇళ్లు పాడైపోయిన వాళ్లకు తక్షణ ఖర్చుల కోసం రూ.10 వేలు, పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వాళ్లకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున గరిష్టంగా రూ.3 వేల వరకు సాయం అందించి ఆదుకుంటామని తెలిపారు.