టాప్ న్యూస్

ఆంధ్రా అధికారులకు అందలం..తెలంగాణ వాళ్లు బలి!

రాష్ట్రంలో మరోసారి తెలంగాణ ఉద్యోగులు వివక్షను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. మనకు న్యాయపరంగా దక్కాల్సిన నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఎన్నో బలిదానాలకు ఓర్చి సాధించిన స్వరాష్ట్రంలోనూ స్థానిక ఉద్యోగులు వివక్షను ఎదుర్కొంటున్నట్టు ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఎలాగైతే ఉద్యోగాలు, ప్రమోషన్ల విషయంలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతోందని చెబుతున్నారు. పలు ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో పైస్థాయిలో ఇప్పటికీ ఆంధ్రా అధికారులే పెత్తనం చెలాయిస్తున్నట్టు తెలిసింది. తాజాగా నిన్న జరిగిన ఓ పరిణామం తెలంగాణ ఉద్యోగులు, ఉన్నతాధికారులకు ఎంతటి తీరని అన్యాయం జరుగుతుందో, సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.రాష్ట్రంలో కరెంటు కోతలు, విద్యుత్ సంస్థల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి నిన్న సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం, కరెంటు కోతలపై సీఎం అధికారుల మీద సీరియస్ అయ్యారు. నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేస్తానని అధికారులను హెచ్చరించారు. అయితే, సీఎం రేవంత్ వ్యాఖ్యలతో విద్యుత్ సంస్థలలో పనిచేసే ఇంజినీర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.