National

Anant Ambani: సైకిల్ తొక్కుతూ ఇంటింటికీ డెలివరీ ఇస్తున్న వ్యక్తి.. అనంత్‌ అంబానీ ఏం చేశాడంటే?

Anant Ambani: రోజంతా సైకిల్ తొక్కుతూ ఆర్డర్లు డెలివరీ చేసే ఒక సామాన్యుడి జీవితంలో అస్సలు ఊహించని సంఘటన జరిగింది. వచ్చే అరకొర సంపాదనతో బైక్ కొనడం అసాధ్యం అనుకున్న వేళ.. అంబానీ ఇంటి నుంచి వచ్చిన ఒక సర్‌ప్రైజ్ అతడి కళ్లలో నీళ్లు తెప్పించింది. ఎండనక, వాననక సైకిల్‌పైనే కిలోమీటర్ల కొద్దీ తిరుగుతున్న ఆ డెలివరీ బాయ్‌ పరిస్థితి చూసి చలించిపోయిన అనంత్ అంబానీ, అతడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు.ముంబైకి చెందిన సుజీత్ అనే యువకుడు డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. అతడికి కనీసం ఒక సెకండ్ హ్యాండ్ బైక్ కొనే స్థోమత కూడా లేదు. దాంతో ప్రతిరోజూ సైకిల్‌ మీదే తిరుగుతూ ఆర్డర్లు డెలివరీ చేస్తుంటాడు. ఒకరోజు రోడ్డుపై అతడు సైకిల్ తొక్కుతూ వెళ్తుండగా హుస్సేన్ మన్సూరి అనే లోకల్ ఇన్‌ఫ్లుయెన్సర్ పలకరించాడు.