National

Amit Tiwari: అభిజిత్ దీప్కేకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చాలి- ఆర్టీఐ కార్యకర్త ఫిర్యాదు

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి అభిజిత్ దీప్కేకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది. ఈ మేరకు సూరత్ కి చెందిన యాక్టివిస్ట్ అమిత్ తివారీ ఆర్టీఐని కోరారు. రిటైర్డ్ ఉద్యోగి అయిన తండ్రి భగవాన్ రావ్.. తన కుమారుడి చదువు కోసం డబ్బులు ఎలా సమకూర్చారో విచారించాలన్నారు. సీజేపీ ఫండ్ రైజింగ్, సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ ప్రకటించిన కోటి రూపాయల లీగల్ డిఫెన్స్ పైనా విచారణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు పన్నుల శాఖకు లేఖ రాశారు అమిత్ తివారీ.