సినిమా

Amit Shah: అమిత్‌ షాతో చిరంజీవి, రామ్ చరణ్‌ భేటీ.. సడెన్‌గా ఎందుకు కలిశారు?

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌కు రావడం.. ఆయన బస చేసిన హోటల్‌కు వెళ్లి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలవడం ఒక్కసారిగా పెద్ద టాపిక్‌గా మారింది. వీళ్లు కలవగానే.. తెరవెనుక ఏదో రాజకీయ వ్యూహం నడుస్తోందని, ఏదో పెద్ద ప్లానే ఉందని చాలామంది అనుకున్నారు. కానీ, అసలు విషయం బయటకు వచ్చాక అందరికీ క్లారిటీ వచ్చింది. ఈ భేటీ వెనుక ఎలాంటి పాలిటిక్స్ లేవని.. కేవలం సినిమా ఇండస్ట్రీలోని ఆర్టిస్టులను వేధిస్తున్న ఒక పెద్ద సమస్య గురించే చిరంజీవి నేరుగా అమిత్ షా దగ్గర మాట్లాడారు. అదే.. ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీతో సెలబ్రిటీల పరువు తీస్తున్న సైబర్ కేటుగాళ్ల వ్యవహారం.ఈ మధ్యకాలంలో హీరోయిన్లు, ప్రముఖుల ముఖాలను డీప్‌ఫేక్ టెక్నాలజీతో మార్చేసి, అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వదులుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మొన్నామధ్య చిరంజీవి ‘ఎక్స్’లో చాలా ఘాటుగా స్పందించారు.