AmitShah: నవంబర్ 1న విపక్షాల ర్యాలీపై బీజేపీ గురి.. రంగంలోకి అమిత్ షా!
AmitShah: నవంబర్ 1న ఢిల్లీ రోడ్లపై ప్రతిపక్ష ఇండియా కూటమి తలపెట్టిన ‘ఓట్ బచావో - దేశ్ బచావో’ ర్యాలీపై బీజేపీ ప్రత్యేకంగా గురిపెట్టింది. దేశ రాజధాని వేదికగా విపక్షాలు భారీ ఎత్తున జనసమీకరణ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తుంటే.. ఆ ప్లాన్‌ను ఆదిలోనే తుంచేయడానికి ఆ పార్టీ అపర చాణక్యుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. విపక్షాల వ్యూహాలకు గండికొట్టి, వారి నిరసనల వేడిని జాతీయ స్థాయిలో తగ్గించడమే లక్ష్యంగా కమలదళం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.ఈ క్రమంలోనే ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అమిత్ షా సమక్షంలో హై-లెవల్ మీటింగ్ జరిగింది. పార్టీ నేషనల్ అధికార ప్రతినిధులు, మీడియా కోఆర్డినేటర్లు, ఐటీ సెల్, సోషల్ మీడియా ముఖ్య నేతలంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. విపక్షాలు లేవనెత్తే ప్రతి అంశాన్ని సునిశితంగా పరిశీలించి, వాటి వెనుక ఉన్న డొల్లతనాన్ని ఎండగట్టాలని అమిత్ షా తన టీమ్‌కు పక్కా రోడ్‌మ్యాప్ ఇచ్చారని చెబుతున్నారు.
