International

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక ఉండదా?.. ట్రంప్ కొత్త నేమ్ గేమ్!..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ ప్రకటన ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఏఐకి ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరు అంత ఆకర్షణీయంగా లేదని భావించిన ట్రంప్.. దానికి కొత్త పేరు పెట్టేందుకు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఓ పోల్ నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ అనే పేరు సరైనది కాదని, అది అంతగా ఆకర్షణీయంగా కూడా లేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఏఐకి బదులుగామూడు పేర్లు సూపర్ ఇంటెలిజెన్స్, ఎక్స్‌ట్రీమ్ ఇంటెలిజెన్స్, సుప్రీం ఇంటెలిజెన్స్‌ను ఆయన సూచించారు. ఈ మూడు పేర్లలో ఏది బాగుంటుందో తన ఫాలోవర్లు ఓటు వేయాలని ట్రంప్ కోరారు.