International

ఎన్నికల ఎఫెక్ట్‌.. ఇరాన్‌ విషయంలో ట్రంప్‌ యూటర్న్‌!?..

అమెరికాలో మధ్యంతర ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ట్రంప్‌కు ఇరాన్‌ విషయంలో కొత్త టెన్షన్ మొదలైందని సమాచారం. పశ్చిమాసియాలో సుదీర్ఘ యుద్ధం, తగ్గుతున్న ఆయుధ నిల్వలు, దేశీయంగా పెరుగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో.. యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్‌ వ్యూహం మార్చుకున్నట్లు తెలుస్తోంది. అణు ఒప్పందం లేకుండానే ఇరాన్‌తో డీల్‌కు సిద్ధమన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. హర్మూజ్‌ జలసంధిని ఎలాంటి షరతులు లేకుండా తెరిస్తే ఒప్పందానికి సిద్ధమని ట్రంప్‌ సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. అయితే అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు తమ ప్రాంతం నుంచి అమెరికా దళాలు వెళ్లాలని ఇరాన్‌ డిమాండ్ చేస్తోంది. దీంతో ట్రంప్‌ యూటర్న్‌ వెనుక అసలు వ్యూహమేంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..