తెలంగాణ
గణేశ్ శోభాయాత్రలో చిక్కుకున్న అంబులెన్స్.. బాలుడు మృతి
రాష్ట్రవ్యాప్తంగా గణనాథుల నిమజ్జనాలు, శోభాయాత్రాలు ఘనంగా కొనసాగుతున్నాయి.యువతీయువకులు, పెద్దలు శోభాయాత్రలో స్టెప్పులు వేస్తూ ‘వెళ్లిరావయ్యా..గణేశా’ అంటూ గంగమ్మ ఒడికి సాగనంపుతున్నారు.ఎక్కడ చూసినా డీజే సౌండ్స్, డప్పుచప్పుళ్ల నడమ గణనాథులు గంగమ్మ ఒడికి చేరేందుకు వెళ్తున్నారు. అయితే, రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో శోభాయాత్రల కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే అంబులెన్స్ గణనాథుడి శోభాయాత్రలో చిక్కుకోవడంతో సకాలంలో వైద్యం అందక రెండేండ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా బోనకల్లో చోటుచేసుకుంది.
