Amazon 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' సేల్ డేట్స్ ఫిక్స్.. డిస్కౌంట్ల జాతర మొదలయ్యేది అప్పుడే!
Amazon: దసరా, దీపావళి సీజన్ రాకముందే ఈ-కామర్స్ రంగంలో వార్ స్టార్ట్ అయ్యింది. ఆన్లైన్ షాపింగ్ ప్రియులకు నిద్రలేకుండా చేసే అసలైన డిస్కౌంట్ల పండగకు రంగం సిద్ధమైంది. తన ప్రత్యర్థి సంస్థ ఫ్లిప్‌కార్ట్ కంటే ఒక అడుగు ముందే ఉంటూ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సరికొత్త ఎత్తుగడ వేసింది. మోస్ట్ అవేటెడ్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్ ఎప్పటినుంచి ప్రారంభం కానుందో అధికారికంగా రివీల్ చేసింది.ఈ ఏడాది ఫెస్టివల్ వార్‌లో అమెజాన్ ముందస్తు వ్యూహం ఆసక్తికరంగా మారింది. ఫ్లిప్‌కార్ట్ తన పాపులర్ ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌ను అక్టోబర్ 9 నుంచి తీసుకువస్తుండగా, దానికి ఒక్కరోజు ముందే.. అంటే అక్టోబర్ 8 నుంచే అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ పండగ మొదలుకానుంది. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మెంబర్లకు అక్టోబర్ 8 నుంచి యాక్సెస్ ఉన్నప్పటికీ, అమెజాన్ మాత్రం తన సాధారణ సేల్‌ను అదే రోజున ఓపెన్ చేసి భారీగా ట్రాఫిక్‌ను లాగేందుకు ప్లాన్ చేసింది.
