Spirituality

Amarnath Yatra: 24 రోజులు.. 4 లక్షల మంది భక్తులు: అమర్‌నాథ్ యాత్రలో సరికొత్త చరిత్ర!

పవిత్ర అమర్‌నాథ్ క్షేత్రానికి భక్తుల తాకిడి కొనసాగుతోంది. ఈ ఏడాది యాత్ర ప్రారంభమైన అతి తక్కువ సమయంలోనే భక్తుల సంఖ్య సరికొత్త రికార్డును కైవసం చేసుకుంది. జులై 3న ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక పయనంలో, కేవలం 24 రోజుల్లోనే అంటే జులై 26 నాటికి 4.14 లక్షల మందికి పైగా భక్తులు మంచులింగాన్ని దర్శించుకుని పునీతులయ్యారు.