ఏపీ
Alur Mla Virupakshi: వైసీపీకి షాక్.. ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిన పోలీసులు
కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేతో సహా 15 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. విరూపాక్షిని చిప్పగిరి పోలీస్ స్టేషన్ నుంచి ఆలూరు కోర్టుకు తరలించారు. ఆలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఆయనను హాజరుపరిచారు. టీడీపీ కార్యకర్త ఫిర్యాదుతో ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకున్నారు.
