వైరల్ న్యూస్

జీవితంలో చదువుతో పాటు ‘క్యారెక్టర్’ ముఖ్యం: వెంకీ మామ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ సీనియర్ హీరో, విక్టరీ వెంకటేశ్ విద్యార్థులకు, యువతకు సంబంధించిన పలు ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ వేడుకకు వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన చేసిన సరదా కామెంట్స్, సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కాలేజీ రోజులు ప్రతీ ఒక్కరి జీవితంలోనూ అత్యంత మధురమైనవని, ఆ 3-4 ఏళ్ల ప్రయాణాన్ని విద్యార్థులు పూర్తిస్థాయిలో ఆస్వాదించాలని వెంకటేశ్ సూచించారు.