తెలంగాణ

డీజే సౌండ్స్‌పై అల్లు శిరీష్ ఆగ్రహం.. సంచలన ట్వీట్

రాష్ట్రంలో వినాయక చవితి పండుగ అయిపోయినా డీజే సౌండ్స్ మాత్రం ఆగడం లేదని సినీ నటుడు అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ ఆవేదన వ్యక్తం చేశాడు. రాత్రుళ్లు డీజే సౌండ్స్ మోత మోగించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. పోలీసులు వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. వివరాల్లోకివెళితే.. అల్లు శిరీష్ నివాసం ఉంటున్న పరిసరాల్లో కొందరు వ్యక్తులు పెద్ద పెద్ద శబ్దాలతో డీజే పెడుతున్నారని, ఫలితంగా పిల్లలు, పెద్దలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సోషల్ మీడియా వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వినోభా నగర్‌లోని హనుమాన్ ఆలయంలో రాత్రి 2/3 వరకు అనుమతించిన దాని కన్నా ఎక్కువ శబ్దంతో సంగీతం మోగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.