ఏపీ

స్థానిక పోరులో కూటమిదే హవా.. కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత

ఏపీలో జరిగిన స్థానిక ఎన్నికల్లో కూటమి సర్కార్ హవా కొనసాగుతోంది. మొత్తం 13 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను అధికారులు లెక్కించారు. అయితే, మొత్తం పదమూడింటిలో 8 కార్పొరేషన్లలో కూటమి అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. విశాఖ, విజయనగరం, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, కడప కార్పొరేషన్లలో కూటమి క్యాండిడేట్స్ ముందంజలో ఉండగా.. 6 స్థానాల్లో టీడీపీ, 2 స్థానాల్లో జనసేన ఆధిక్యంలో ఉన్నాయి. మరో రెండు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు పుంగనూరు మున్సిపాలిటీలో టీడీపీ జయకేతనం ఎగురవేసింది.మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా.. జనసేన 2, బీజేపీ 2 స్థానాల్లో, సీపీఐ 1, ఇతరులు ఒక చోట విజయం సాధించారు. మొత్తం 36 వార్డుల్లో 32 ఏకగ్రీవం అవ్వగా.. 4 వార్డులకు పోలింగ్ జరిగింది. కాగా, పోలింగ్ జరిగిన స్థానాల్లోనూ టీడీపీ నేతలు ఆధిక్యంలో ఉన్నట్టు సమాచారం.