తెలంగాణ
Alleti Maheshwar Reddy: రేవంత్ రెడ్డి కొత్తగా "రూల్ బుక్" ఏమైనా పెట్టుకున్నారా?’.. మహేశ్వర్ రెడ్డి ప్రశ్న..
Alleti Maheshwar Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు వేదికగా మారుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఈ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేయడంపై బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో లేని సభ్యులను సైతం సస్పెండ్ చేయడం గతంలో ఎన్నడూ లేని పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా శాసనసభలో మాట్లాడిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి .. సభా నిబంధనల ఉల్లంఘన జరిగితే ప్రశ్నించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అయితే, కొందరు సభ్యులను ఇష్టానుసారంగా సస్పెండ్ చేయడం సరైన విధానం కాదని విమర్శించారు. “ఏ పుస్తకం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు? కొత్తగా రేవంత్ రెడ్డి రూల్ బుక్ ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా?” అంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
