తెలంగాణ

క్షుద్రపూజల ఆరోపణలు..వారిపై హరీశ్ రావు పరువునష్టం దావా!

రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలకపరిణామం చోటుచేసుకుంది. తన మీద అసత్య ఆరోపణలు చేసినందుకు గాను బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. క్షుద్రపూజల పేరిట నిరాధారమైన ఆరోపణలు చేశారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ల మీద హరీశ్ రావు న్యాయపోరాటానికి దిగారు. ఇప్పటికే వారికి లీగల్ నోటీసులు పంపించిన ఆయన.. వారిద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పకపోవడంతో ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది. గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో కాంగ్రెస్ నేతలపై క్రిమినల్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. తన రాజకీయ ప్రతిష్టను, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ నేతలు అసత్య ఆరోపణలు చేశారని, వీరిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నట్టు తెలిసింది.