ఏపీ
ఆళ్ల నాని హుందా రాజకీయాలు చేశారు : మంత్రి నారా లోకేశ్
గత వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని మంగళవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.గురువారం ఏలూరు జిల్లాలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నారాలోకేష్ హాజరయ్యారు. ఆళ్ల నాని కుటుంబసభ్యులను పరామర్శించి సానుభూతి ప్రకటించారు.లోకేష్ వెంట మంత్రులు నిమ్మల, పార్థసారథి, ప్రజాప్రతినిధులు సైతం ఉన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్రం మంచి వ్యక్తిని కోల్పోయిందని పేర్కొన్నారు. నాని డివ్యూటీ సీఎం అయ్యాక శాసనమండలిలో ఆయనతో పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఆయన ఏ రోజు వ్యక్తిగత విమర్శలు చేయలేదని గుర్తుచేశారు. చాలా హుందాగా ప్రజాసమస్యలపై మాత్రమే మాట్లాడారని వెల్లడించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజలకు నిబద్ధతతో సేవ చేసిన వ్యక్తి ఆళ్లనాని అని చెప్పారు.
