National
వాహనదారులకు హెచ్చరిక.. ఇలా చేయకుంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు!
దేశవ్యాప్తంగా ఉన్న వాహనదారులందరూ తమ డ్రైవింగ్ లైసెన్స్‌కు (DL) మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని కేంద్ర రవాణా శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాబోయే సెప్టెంబరు 25నాటికి ఈ అప్‌డేట్ ప్రక్రియను పూర్తిచేయాలని రవాణా శాఖ అధికారులు తుది గడువు విధించారు. ఒకవేళ నిర్దేశిత గడువులోగా మొబైల్ నంబర్‌ను అనుసంధానించకపోతే సంబంధిత డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేస్తామని అధికారులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
