ప్రపంచం
Alert : ఉచిత వైఫై వాడేవారికి అలర్ట్.. మైక్రోసాఫ్ట్ థ్రెట్ హెచ్చరిక
మొబైల్ యూజర్లు ఎవరైతే హోటల్స్, పబ్లిక్ ప్రదేశాల్లో ఉచిత ఇంటర్ నెట్ (వైఫై) వినియోగించేవారికి మైక్రోసాఫ్ట్ థ్రెట్ హెచ్చరికలు జారీచేసింది.ఇలాంటి వారిని టార్గెట్ చేసుకుని సైబర్ మోసగాళ్లు దాడులు చేస్తున్నారని ముందస్తు వార్నింగ్ ఇచ్చింది. పబ్లిక్, హోటల్ వైఫై నెట్వర్క్ల ద్వారా జరుగుతున్న ఈ దాడులను 'క్యాప్టివ్క్రంచ్'గా అభివర్ణించింది. దీని వెనుక రష్యాకు చెందిన ఓ ముఠా హస్తం ఉన్నట్టు మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ బృందం హెచ్చరించింది. హ్యాకింగ్ గ్రూప్ 'మిడ్నైట్ బ్లిజార్డ్'గా ముఠాగా అనుమానం వ్యక్తం చేసింది.
